NTV Telugu Site icon

Dharmapuri Srinivas : అస్వస్థతకు గురైన డీఎస్‌.. సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరిక

Arvind

Arvind

టీపీసీసీ చీఫ్, మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా డీఎస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే.. సోమవారం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం డీఎస్‌ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నీ కార్యక్రమాలను రద్దు చేసుకొని.. హుటాహుటిన ఆస్పత్రికి బయలుదేరారు.

Also Read : Zelensky: వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర వాళ్లతోనే చంపబడతాడు.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

డీఎస్ అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో ఆయన సన్నిహితులు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నారు. ధర్మపురి అర్వింద్ అభిమానుల్లో కూడా కాస్త ఆందోళన నెలకొంది. ‘మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను.’ అని ఎంపీ అర్వింద్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

Also Read : Exxeella Education Group: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

Show comments