MP Dharmapuri Arvind: ఆ అంశంపై ఎలక్షన్ కమిషన్ సిరియస్.. ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు..

Mp Arvind Dharmapuri

Mp Arvind Dharmapuri

MP Dharmapuri Arvind: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనను ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. పోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను, పోలింగ్ సిబ్బందిని పరుష పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కెమెరాలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 132, 223, 296(బి) కింద కేసులు నమోదు చేశారు. అదనంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 226 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

READ MORE: Trump-Netanyahu: వైట్‌హౌస్‌లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ.. ఇరాన్‌కు చివరి వార్నింగ్ ఏంటంటే..!