Sai Dharam Tej : పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికలలో ఎన్డియే కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లలో పోటీచేసి 21 సీట్లను గెల్చుకున్నారు.అలాగే పోటీ చేసిన రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలుచుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.ఈ ఎన్నికలలో ఎన్డియే కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి సంచలన విజయం సాధించింది.తాజాగా ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా,మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసారు.గత ఎన్నికలలో పోటీ చేసిన భీమవరం ,గాజువాక నియోజకవర్గాలలో ఓడిపోయారు.ఓడిపోయినా కూడా ఎంతో ఓర్పుతో వున్న పవన్ కల్యాణ్ ప్రభుత్వ ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో టీడీపీ ,బీజేపీలతో కలిసి పోటీ చేసి సంచలన విజయం సాధించారు.
Read Also :Devara : రిలాక్స్ మోడ్ లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సెంటిమెంటే కారణం
అయితే పవన్ కల్యాణ్ విజయం కోసం మెగా ఫ్యామిలీ సపోర్ట్ గా నిలిచింది.మెగా హీరోలు వరుణ్ తేజ్ ,వైష్ణవ్ తేజ్ ,సాయి ధరమ్ తేజ్ పిఠాపురం లో ప్రచారం కూడా చేసారు.తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకొని తాజాగా ఆ మొక్కు తీర్చుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భార్య పవన్ కల్యాణ్ వదినమ్మ సురేఖ.. పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.లగ్జరీ పెన్ బ్రాండ్ మౌంట్ బ్లాక్ నుంచి పవన్ కళ్యాణ్ కి ఒక మంచి పెన్ గిఫ్ట్ ఇచ్చారు. దాని ఖరీదు దాదాపు మూడున్నలక్షల రూపాయలుగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.అలాగే తాజాగా పవన్ కల్యాణ్ కు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మంచి గిఫ్ట్ అందించాడు.నన్ను స్టార్ వార్స్ లెగో కు పరిచయం చేసిన నా ప్రియమైన జేడీ మాస్టర్ అండ్ డిప్యూటీ సీఎంకు చివరకి నా చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు అతనిలోని చైల్డ్ కు గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ లభించింది.అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు.
To my beloved Jedi master & deputy CM – the man who introduced me to Star Wars and Lego
Now finally,I got a chance to give a gift for the child in him, to relive my childhood days.
From his young PADUWAN.… pic.twitter.com/VdQIn9sU4w— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 16, 2024