NTV Telugu Site icon

Dhar Gang: ధార్ గ్యాంగ్ గుంటూరు జిల్లాలో మకాం వేసిందా..?

Dhar Gang

Dhar Gang

Dhar Gang: ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం వేసిందా.. వరుస దొంగతనాలు ఆ గ్యాంగ్‌ పనేనా..? పల్నాడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ప్రశ్న.. పగలంతా రెక్కీ చేస్తారు, తాళాలు వేసిన ఇళ్లకు కాపలా పడుకుంటారు.. సరిగ్గా సమయం కుదిరింది అనుకుంటే ఇల్లు గుల్ల చేసేస్తారు.. సెల్ఫోన్ వాడరు, సిగ్నల్ దొరకనివ్వరు, తమ మొహాలు కనపడనివ్వరు.. అసలు పగలు వీళ్ళని చూస్తే వీళ్ళ దొంగలు అన్నట్లు ఉంటారు.. రాత్రి అయ్యిందంటే ప్రత్యేక ముసుగులతో ఇళ్ళ మీద పడిపోతారు.. ఎంత సైలెంట్ గా వచ్చారో, అంత వైలెంట్ గా పని కానించి వెళ్లిపోతారు.. ప్రధానంగా జాతీయ రహదారులకు సమీపంలో ఉండే గ్రామాలను టార్గెట్ చేస్తారు.. ఇదే ఈ గ్యాంగ్ స్టైల్.. మధ్యప్రదేశ్ లో ఉండే ఈ గ్యాంగ్ గురి చూసి కొట్టిందంటే, దేశంలోని ఏ గ్రామమైన వణికి పోవాల్సిందే.. అలాంటి దెబ్బే ప్రస్తుతం పల్నాడు జిల్లాకు తగిలింది… సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు సొంతిళ్లకు బంధువులకు వెళ్లిన 17 కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్ల ఇళ్ళను గుల్ల చేసేసారు ఈ గ్యాంగ్..

Read Also: Mahakumbh 2025 : 26 రోజుల్లో కుంభమేళాకు 40 కోట్ల మంది.. ఈ తేదీ నాటికి 50 కోట్ల దాటే ఛాన్స్

పల్నాడు జిల్లాలో, గుట్టు చప్పుడు కాకుండా ధార్ గ్యాంగ్ చేసిన దొంగతనాలు స్థానికులను భయభ్రాంతులను గురిచేశాయి.. అసలు ఈ దొంగతనాలు చేసిన దొంగల నేరచరిత్ర వింటే ఒళ్ళు గగ్గుర్పాటు వస్తుంది.. ఎందుకంటే మనిషిని మనిషిగా లెక్కించని మనస్తత్వం ఈ దొంగలది.. ప్రాణం విలువ ఏమాత్రం తెలియని మూర్ఖత్వం ఈ దొంగలది.. ఒక్కసారి ఊరు మీద పడ్డారంటే.. వారు దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగారంటే.. వారి ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు.. ఈ దొంగలకు ఒక నాయకుడు ఉంటాడు.. ఆ నాయకుడు ఏది చెబితే అదే చేస్తారు ఈ ముఠా… మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరే ఈ ముఠా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుంటారు.. బచాడో గ్యాంగ్, ధార్ గ్యాంగ్, భూరియా గ్యాంగ్ , చంబా గ్యాంగ్, పార్ధు గ్యాంగ్ ఇలా ఒక్కొక్కరిది , ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క పేరు.. ఒక్కొక్క స్టైల్.. కానీ అందరూ చేసేది లూటీ చేసేయడమే..

Read Also: PM Modi: ఈ విషయంలో అన్నా హజారే కూడా సంతోషిస్తారు

ముఖ్యంగా ఇటీవల కాలంలో సౌత్ ఇండియాని టార్గెట్ చేసుకుంది ఈ దొంగల ముఠా . దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల్లో బంగారపు వినియోగం ఎక్కువగా ఉండటంవల్ల , బంగారం ఉంటే మెడలో అయినా ఉంటుంది, లేదంటే ఇళ్ళలో బీరువాలో అయినా ఉంటుందని ఆలోచనతో వీళ్ళు రెక్కీలు నిర్వహిస్తుంటారు.. వీళ్ళ కంటపడ్డారంటే, ఇల్లైనా కొల్లగొడతారు, మనిషినైనా గుల్ల చేస్తారు.. కానీ, తమ అనుకున్నది మాత్రం చేసే వెళ్తారు ఈ దొంగలు… అలాంటి దొంగల ముఠా పల్నాడు ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా, కొన్ని ఊళ్లను ఉడ్చేసింది… మూడు ఊర్లలో 17 ఇళ్లలో ఏకకాలంలో చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయారు.. వీళ్ళు వచ్చిన చోట సీసీ కెమెరాలు కూడా పనిచేయవు, ఎందుకంటే పూర్తిగా ముసుగులు ధరించి ముందు వచ్చి విరకొట్టేది సీసీ కెమెరాలు నే…. తాము కప్పుకున్న ముసుగులతో తమ ఆకారాలు కూడా కనపడనీయకుండ చేయటం వీళ్ల స్టైల్ …