NTV Telugu Site icon

Rayan Movie : రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్న ధనుష్ ‘రాయన్‌’..

Rayan

Rayan

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం కుబేర చేస్తున్నాడు. దాంతో పాటుగా రాయన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు డైరెక్టర్ కూడా ధనుషే కావడం విశేషం.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.. మేకర్స్ తాజాగా పోస్టర్ తో డేట్ ను ప్రకటించారు..

ఇక ధనుష్ కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై క్యూరియాసిటీని పెంచింది.. రీసెంట్ గా ఈ సినిమానుంచి విడుదలైన మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త AR రెహమాన్ మాస్ నంబర్‌ను కంపోజ్ చేశారు.. దానిని గ్రాండ్‌గా చిత్రీకరించారు. ధనుష్ ఒక కార్నివాల్‌లో చాలా మంది గ్రామస్తులతో కలిసి మాస్ డ్యాన్స్‌లు చేస్తూ కనిపించాడు..

ప్రస్తుతం ఆ పాట అన్ని వర్గాలను ఆకర్షిస్తుంది, ముఖ్యంగా మాస్ కోర్‌కి బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో ధనుష్ హ్యాండిల్‌బార్ మీసాలతో పొట్టి జుట్టుతో కనిపిస్తున్నాడు.. ఇక జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా రాయన్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.. ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..

Show comments