Rayan Movie : రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్న ధనుష్ ‘రాయన్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం కుబేర చేస్తున్నాడు. దాంతో పాటుగా రాయన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు డైరెక్టర్ కూడా ధనుషే కావడం విశేషం.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.. మేకర్స్ తాజాగా పోస్టర్ తో డేట్ ను ప్రకటించారు..
ఇక ధనుష్ కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై క్యూరియాసిటీని పెంచింది.. రీసెంట్ గా ఈ సినిమానుంచి విడుదలైన మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త AR రెహమాన్ మాస్ నంబర్‌ను కంపోజ్ చేశారు.. దానిని గ్రాండ్‌గా చిత్రీకరించారు. ధనుష్ ఒక కార్నివాల్‌లో చాలా మంది గ్రామస్తులతో కలిసి మాస్ డ్యాన్స్‌లు చేస్తూ కనిపించాడు..
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ప్రస్తుతం ఆ పాట అన్ని వర్గాలను ఆకర్షిస్తుంది, ముఖ్యంగా మాస్ కోర్‌కి బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో ధనుష్ హ్యాండిల్‌బార్ మీసాలతో పొట్టి జుట్టుతో కనిపిస్తున్నాడు.. ఇక జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా రాయన్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.. ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?