OM Chapter 1 First Single Alaaka Luvaa Out: తమిళ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 55వ చిత్రం ‘ఓం – చాప్టర్ 1: ఉధిరమ్ – ది బ్లడ్ వుడ్’ నుంచి తొలి పాట ‘అలాకా లూవా’ను చిత్రబృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మాస్ బీట్స్, ఎనర్జిటిక్ వోకల్స్, ధనుష్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ పాటకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. తెలుగు వెర్షన్‌లో రామ్ మిరియాల, అరుణ్ కౌండిన్య గాత్రం అందించగా.. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఇటీవల విడుదలైన ‘ఫస్ట్ స్ట్రైక్’ టీజర్ కూడా మంచి స్పందన అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్ మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవితో ధనుష్ ‘మారి 2’ తర్వాత మరోసారి జతకడుతున్నారు. శ్రీలీల కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ‘అమరన్’ విజయంతో గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్-టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

