NTV Telugu Site icon

Dhanush: స్కూల్ ఫ్రెండ్స్ తో స్టార్ హీరో రీయూనియన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

Dhanush

Dhanush

Dhanush: స్టార్ డమ్ వచ్చిన తరువాత తోటి నటీనటులతో పార్టీలు చేసుకోవడం తప్ప తమ చిన్నప్పటి మిత్రులను గుర్తుపెట్టుకునే వారు చాలా తక్కువ. అయితే కొంత మంది స్టార్స్ మాత్రం ఎంత ఎదిగినా తమ మూలలను గుర్తుంచుకుంటారు. చిన్ననాటి స్నేహితులపై ఉండే మమకారాన్ని మర్చిపోరు. అటువంటి వారిలో ఒకరు హీరో ధనుష్. తమళ్ తో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. అయితే తాజాగా రీయూనియన్ లో తన స్కూల్ ఫ్రెండ్ ను కలుసుకున్నాడు ధనుష్

మొదట్లో ధనుష్ పెద్ద హీరో అయిపోయాడు మాతో కలుస్తాడా లేదా అని అందరూ అనుకున్నారట. ఒక్క ఫోటో అయినా దిగుతాడో లేదో అని భయపడ్డారట. అయితే ధనుష్ అక్కడికి రాగానే మూలలను ఎలా మర్చిపోతాను అని వారితో అనడంతో వారందరూ ఎంతో సంతోషంతో ఆయనతో ఫోటో దిగారు.

Also Read:Pooja Hegde: ట్రెడిషనల్ లుక్ లో ఫిదా చేస్తున్న పూజా హెగ్డే… లేటెస్ట్ పిక్స్ వైరల్

అంతేకాకుండా ధనుష్ వారితో కలిసి డ్యాన్స్ లు చేస్తూ, పాటలు కూడా పాడారట. దాంతో పాటు వారితోనే కలిసి భోజనం కూడా చేశారట. స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ కు సంబంధించిన ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ సింపుల్ సిటికీ ఫ్యాన్స్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అయితే తాను చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం వలన సరిగా చదువుకోలేకపోయానని గతంలో ధనుష్ విచారణ వ్యక్తం చేశారు. సార్ సినిమా ప్రమోషన్స్ సమయంలో అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేసినందుకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుందంటూ ధనుష్ చెప్పారు. రీయూనియన్ సందర్భంగా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ధనుష్ తెలిపారు.

Show comments