NTV Telugu Site icon

Dhanush : మరో తెలుగు దర్శకుడితో ధనుష్ మూవీ..?

Whatsapp Image 2024 05 06 At 12.46.12 Pm

Whatsapp Image 2024 05 06 At 12.46.12 Pm

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.అది కూడా తెలుగు దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ధనుష్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో “కుబేర” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.రీసెంట్ గా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

తెలుగులో శర్వానంద్ హీరోగా “శ్రీకారం” అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్.. ధనుష్ ను కలిసి కథ వినిపించగా ఆ కథ ధనుష్ కి నచ్చడంతో సినిమా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.ఈ కాంబినేషన్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెట్ చేసినట్లు తెలుస్తుంది.శ్రీకారం సినిమా కమర్షియల్ గా అంతగా వర్క్ అవుట్ కాకపోయినా ఆ సినిమాతో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం అందరికి నచ్చింది.దీనితో దిల్ రాజు ఈ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చాడు.మరి ఈ దర్శకుడు ధనుష్ తో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి .

Show comments