తమిళ స్టార్ హీరో ధనుష్ కు తెలుగుతో పాటు హిందీలోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే ముందుగా హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ చేసి హిట్స్ అందుకున్నాడు. అలా 2013లో రాంఝనా అనే సినిమా చేసాడు ధనుష్. స్టార్ కిడ్ సోనమ్ కపూర్ హీరోయిన్ గా అభయ్ డియోల్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయి ధనుష్ కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపధ్యంలో రాంఝనా సినిమాను ఆగస్టు 1న రీరిలీజ్ చేసారు.
Also Read : Breaking news : పవన్ కళ్యాణ్ షూటింగ్ ను అడ్డుకున్న కార్మిక సంఘాలు..
కానీ తాజాగా రీరిలీజ్ అయిన రాంఝనా సినిమా క్లైమాక్స్ ను AI టూల్ సాయంతో మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేసారు మేకర్స్. ఈ విషయమై ధనుష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ‘రాంఝనా సినిమాను క్లైమాక్స్‌లో పూర్తిగా మార్చి తిరిగి విడుదల చేయడం నన్ను భాద పెట్టింది. ఈ అసందర్భ ముగింపు సినిమా ఆత్మనే కోల్పోయింది. క్లైమాక్స్ ను మారుస్తున్నామని మేకర్స్ నాకు చెప్పారు. కానీ నేను వద్దని వారించాను అయిన వారు వినాలేదు. ఇది 12 సంవత్సరాల క్రితం నేను కమిట్ అయిన సినిమా కాదు.సినిమాలను లేదా కంటెంట్‌ను మార్చడానికి AI ( Artificial Intelligence ) ను ఉపయోగించడం కళ మరియు కళాకారులకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఇది కథ చెప్పే విధానం మరియు సినిమా రూపురేఖలను మారుస్తోంది ఇది ఎప్పటికి మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి పద్ధతులను నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలులోకి వస్తాయని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను’ అని లెటర్ రిలీజ్ చేసారు.
