Site icon NTV Telugu

Dhanraj : ధనరాజ్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది.

Whatsapp Image 2023 11 06 At 12.27.24 Pm

Whatsapp Image 2023 11 06 At 12.27.24 Pm

జబర్దస్త్ తో చాలా మంది నటులు కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..జబర్దస్త్ తో బాగా సక్సెస్ అయి తర్వాత సినిమాల్లో కమెడియన్స్ గా మరియు హీరోలుగా కూడా ఇండస్ట్రీ లో బాగా బిజీ అవుతున్నారు.అయితే వీరిలోనే రైటర్స్ మరియు డైరెక్టర్స్ కూడా ఉండటం విశేషం… ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ శాంతి కుమార్ మరియు వేణు దర్శకులుగా మారారు. వేణు బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.త్వరలోనే కిరాక్ RP కూడా దర్శకుడిగా రాబోతున్నాడు. తాజాగా మరో కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. సినిమాల్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇందులో హీరోగా తానే చేయడం విశేషం.స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా ధనరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఎవరూ టచ్ చెయ్యని ఒక పాయింట్ తో ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు ధనరాజ్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మరియు మాటలు సమకూరుస్తూన్నారు. సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు… ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ నవంబర్ 9 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.మరి బలగం సినిమాతో వేణు బంపర్ హిట్ కొట్టినట్లు ధనరాజ్ కూడా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..

Exit mobile version