Site icon NTV Telugu

Dhanashree Verma : డ్యాన్సులో శ్రీలీలను బీట్ చేస్తున్న యువ క్రికెటర్ భార్య

New Project (41)

New Project (41)

Dhanashree Verma : సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వారిలో ధనశ్రీ వర్మ ఒకరు. ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా, ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. నిత్యం తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ అమ్మడు. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్‌లో నటిగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఆకాశం దాటి వ‌స్తావా సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీలో కొరియోగ్రాఫర్ యష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో యష్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read Also:Umpire Injury: అయ్యో ఎంతపనాయె.. అంపైర్ కన్ను, మూతి పగిలిపోయాయిగా! పెర్త్ మైదానంలోనే

ఆకాశం దాటి వస్తావా సినిమాలో మరో హీరోయిన్ గా భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెకండ్ లీడ్ హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు ధనశ్రీ వర్మను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ బ్యూటీ డ్యాన్సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బాడీలో టింజ్.. న‌రాల్లో వేడి.. స్ప్రింగు లాంటి బాడీ లాంగ్వేజ్.. స్పీడ్ వ‌గైరా అర్థమైపోతాయి

Home Minister Vangalapudi Anitha: బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ రెడీ..! గంజాయి బ్యాచ్‌ ఆస్తులు సీజ్‌.. హోం మంత్రి వార్నింగ్..
Read Also:

చాహల్ తో పెళ్లికి ముందు న‌టిగా, మోడ‌ల్ గా ధ‌న‌శ్రీ సుప‌రిచితురాలే. అంత‌కుమించి మంచి డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉన్న బ్యూటీగాను పేరు తెచ్చుకుంది. డ్యాన్సుల్లో సాయిప‌ల్ల‌వి, శ్రీ‌లీల‌తో పోటీప‌డే స‌త్తా ఈ అమ్మడికి ఉందనే చెప్పుకోవాలి. అంత‌గా ఇన్ స్టాలో ధ‌న‌శ్రీ పోస్ట్ చేసిన డ్యాన్సింగ్ వీడియోలు ఆక‌ట్టుకుంటున్నాయి. స్టూడియోలో కొలీగ్స్ కి చెమ‌ట‌లు ప‌ట్టించే రేంజులో స్టెప్పులేస్తోంది ఈ బ్యూటీ. ప‌లు వాణిజ్య ప్రక‌ట‌న‌ల్లోను త‌న డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో అద‌ర‌గొట్టిన వీడియోలు ఇన్ స్టాలో ఉన్నాయి. ఆదిత్యా రాయ్ క‌పూర్ తో క‌లిసి `బాబు కి బేబి` పాట‌లోను ధ‌న‌శ్రీ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్లతో అలరించింది.

Exit mobile version