Site icon NTV Telugu

DGP Mahender Reddy Tour: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం..

Dgp

Dgp

DGP Mahender Reddy Tour: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రారంభించారు. మావోయిస్టు ఆపరేషన్స్‌లో భాగంగా భద్రాద్రి, ములుగు జిల్లాలో పర్యటించినట్లు డీజీపీ వెల్లడించారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీసు శాఖ కృషిచేస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసుల పనితీరుపై సమీక్ష చేపట్టినట్లు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర నిఘా, ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మావోయిస్టుల గేట్ వే కావడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా్మన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా పోలీసుల పనితీరు భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు.

MLAs Poaching Case: ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటాం: హైకోర్టు

శాంతిభద్రతలపైనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు టాప్ ప్రియారిటీ ఇస్తోందన్నారు. మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామన్న ఆయన.. భవిష్యత్‌లో మావోయిస్టులకు ప్రవేశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. భద్రాద్రి, ములుగు జిల్లాల పోలీసు సిబ్బందిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.

Exit mobile version