ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు తీసుకుంది. సిబ్బంది షెడ్యూలింగ్ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. విమానయాన భద్రతా ప్రోటోకాల్‌లను తీవ్రంగా ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. బాధ్యత వహించిన అధికారులలో చురా సింగ్ (డివిజనల్ వైస్ ప్రెసిడెంట్), పింకీ మిట్టల్ (చీఫ్ మేనేజర్ – క్రూ షెడ్యూలింగ్), పాయల్ అరోరా (క్రూ షెడ్యూలింగ్ – ప్లానింగ్) ఉన్నారు. ఈ అధికారులను వెంటనే క్రూ షెడ్యూలింగ్ బాధ్యత నుంచి తొలగించాలని DGCA స్పష్టం చేసింది.
Also Read:Liquor Smuggling : అబ్బా.. భలే ఉంది మీ ఐడియా..! మందు సీసాల తరలింపుకు స్పెషల్ జాకెట్
భవిష్యత్తులో సిబ్బంది షెడ్యూలింగ్‌లో ఉల్లంఘనలు జరిగితే లైసెన్స్ సస్పెన్షన్, కార్యాచరణ పరిమితులు సహా కఠినమైన చర్యలు ఉంటాయని DGCA ఎయిర్ ఇండియాను హెచ్చరించింది. గత వారం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్ కఠినమైన పరిశీలనలో ఉన్న సమయంలో DGCA నుండి తాజా ఆదేశాలు వచ్చాయి. జూన్ 12న 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు తప్ప అందరూ మరణించారు.
