NTV Telugu Site icon

Viral: అయ్యో దేవుడా.. కోరికలు ఇలా కూడా ఉంటాయా !

Whatsapp Image 2023 01 14 At 1.13.17 Pm

Whatsapp Image 2023 01 14 At 1.13.17 Pm

Viral: నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకీ, ప్రకాష్ రాజ్ భోజన సమయంలో వారి మధ్య ఓ కామెడీ సీన్ ఉంటుంది గుర్తుందా. భోజనం చేసే ముందు దేవుడిని ప్రార్థించాలని అంటే వెంకటేశ్ దేవుడికి ప్రేయర్ చేసేసీన్. దేవుడా… ఓ మంచి దేవుడా… నాకు తినడానికి తోటకూర పప్పిచ్చావ్.. బంగాళదుంప ఫ్రై ఇచ్చావ్.. అంటూ వెంకీ దేవుడికి ప్రేయర్ చేస్తాడు గుర్తుంది కదూ. ఇప్పుడు తాజాగా ఏడు కొండలవాడి సన్నిధిలో ఓ తల్లిదండ్రులు దేవుడికి ఓ వెరైటీ ప్రపోజల్ పెట్టారు. ‘దేవుడా అనిల్ కుమార్ రెడ్డికి, మణితేజా రెడ్డి చదువురావాలని దీవించు.. గోవింద’ అంటూ రాశారు ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Guava Benefits : రోజుకో పండు తినండి.. రోగాలకు దూరంగా ఉండండి

ఇలా చాలా మంది తమ కోరికలను దేవుడికి తెలిసేలా వివిధ రకాల ప్రార్థనలు చేస్తుంటారు. గతంలో బాలీవుడ్ స్టార్ అబితాబ్ కూడా ఓ వెరైటీ కోరిక కోరుకున్నారు. అమితాబ్ కి ఏడాదికి 465 రోజులు కావాలట. ఆయనకు ఏడాదికి 365 రోజులు సరిపోవట్లేదట. అందుకే 465 రోజులు ఉండేలా చూడు స్వామి అంటూ తెగ ప్రార్థించేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విచిత్ర వార్త వైరల్ అయింది. 2017లో అమితాబ్ చేతిలో ఒకేసారి పదిహేనుకు పైగా కథలున్నాయట. వాటిని పూర్తి చేయాలంటే ప్రస్తుతం ఏడాదికి ఉన్న 365రోజులు సరిపోవని, అదనంగా మరో 100 రోజులు కావాలంటూ దేవుడిని కోరుతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ వింత కోరికను విన్న నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

Read Also:Makara Jyothi 2023: నేడే శబరిమల మకరజ్యోతి దర్శనం.. చేరుకున్న లక్షలాది మంది భక్తులు

దేవుడా… అందమైన భార్యనిచ్చావు. మంచి బిడ్డలను ఇచ్చావు. బోలెడు సంపదనిచ్చావు. ఊహించనంత ఇమేజ్ ని ఇచ్చావ్. అలానే నాకో వరమీ దేవుడా… నాకు ఏడాదికి 465రోజులు ఉండేలా దీవించు దేవుడా అంటూ అమితాబ్ వింత కోరికను కోరుతున్నారని తెగ షేర్లు కొట్టేశారు. ఏమైనా అమితాబ్ కోరిక మాత్రం కాస్త ఫన్నీగానే ఉంది కదండీ.

Show comments