Site icon NTV Telugu

Musalamma: శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి 30 లక్షల రూపాయలతో కరెన్సీ అలంకరణ..!

Image (6)

Image (6)

Musalamma: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంక గ్రామంలో భక్తులు విశేష భక్తి శ్రద్ధలతో శ్రీముసలమ్మ అమ్మవారిని అలంకరించారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా జరిగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని 30 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణలో కొత్త కరెన్సీ నోట్ల మధ్య అమ్మవారు సిరులను కురిపించే ధనలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Breastfeeding-benefits : డెలివరీ తర్వాత చనుబాలు ఇస్తే బరువు తగ్గుతారా? వైద్యులు ఏం అంటున్నారంటే..

ఈ ప్రత్యేక దర్శనాన్ని ఆస్వాదించడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కడుతున్నారు. అమ్మవారిని చూసి లక్ష్మి కటాక్షం పొందాలని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల ఉత్సాహం, అలంకరణ వైభవం గ్రామం మొత్తాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తాయి. ఈ మధ్యకాలంలో ఏదైనా పవిత్ర రోజులలో దేవత మూర్తులకు ఇలా డబ్బులతో అలంకరించడం పరిపాటిగా మారింది.

Lenovo Idea Tab: 11 అంగుళాల భారీ డిస్ప్లే, 4 సంవత్సరాల సెక్యూరిటీ పాచ్‌లతో లెనోవో ఐడియా ట్యాబ్ లాంచ్!

Exit mobile version