Site icon NTV Telugu

Deviyani : గ్లామర్ తో పిచ్చెక్కించేస్తున్న ‘సేవ్ ద టైగర్స్’ బ్యూటీ.. మామూలు అందాలు కాదు

New Project (70)

New Project (70)

Deviyani : ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ చిత్రంలో హీరో స్నేహితురాలిగా నటించింది దేవయాని శర్మ. ఈ సినిమాతో దేవయాని శర్మకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో మెరిసింది. 2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌లో కూడా ఆమె హోమ్లీగా కనిపించింది. ఈ సిరీస్‌కి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో దేవయానికి మంచి గుర్తింపు వచ్చింది. అదే ఏడాది సైతాన్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సైతాన్ సిరీస్‌లో దేవయాని నటన అందరినీ ఆకట్టుకుంది. దేవయాని శర్మ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో బాలీవుడ్‌లో ఓ సినిమా చేసింది. అక్కడ లవ్ శుదా సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రొమాంటిక్ చిత్రాలతో పాటు, ఆమె అనగనగా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్‌లను కూడా చేసింది. మెల్లగా అవకాశాలు అందుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న దేవయాని శర్మ సోషల్ మీడియాలో అరాచకమే అనే చెప్పాలి. ఈ అమ్మడు ఫోటోలకు మంచి క్రేజ్ ఏర్పడింది. దేవయాని శర్మ తన అందంతో కుర్రాళ్ల గుండెల్లోకి బాణాలు ఎక్కిస్తోంది. ఈ అమ్మాయి ఎవరు అంటూ అబ్బాయిలు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా దేవియాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రకృతి అందాల మధ్య ఆమె ఆకర్షణీయమైన లుక్ అభిమానులను అట్రాక్ట్ చేసింది. ప్రతిఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలి అనే క్యాప్షన్ తో తన లైఫ్ స్టైల్ ను హైలెట్ చేసింది. ప్రస్తుతం దేవియాని కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టి బిజీగా కొనసాగుతోంది. “లైఫ్ స్టోరీస్” అనే కొత్త వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్రలో నటించనుంది. దేవియాని సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వం, గ్లామర్‌ను హైలెట్ చేస్తూ, నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజా ఫోటోషూట్‌లో ఆమె కేవలం సౌందర్యమే కాకుండా, క్యూట్ లుక్స్ తో కూడా ఆకట్టుకుంది. ప్రకృతి మధ్య ఆమె క్లాసీ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించే విధంగా ఉంది. ప్రత్యేకంగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఆమె పోజు హీటెక్కించేసేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version