NTV Telugu Site icon

Devineni Avinash: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలి

Avinash

Avinash

టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలకు వైసీపీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దేవినేని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. జిల్లా పరువు దిగజారిపోయిందన్న గద్దె విమర్శలును ఆయన ఖండించారు. టీడీపీ హయాంలో కాల్ మని, సెక్స్ రాకెట్ తో జిల్లా పరువు పోయింది.. కృష్ణా జిల్లా పరువును నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గురించి పట్టించుకోకుండా.. 175 అసెంబ్లీ సీట్లపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.. సజ్జల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిగ్గు లేని ఆరోపణలు చేస్తున్నారు అంటూ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Israel: 5,500 ఏళ్ల నాటి గేటును కనుగొన్న పరిశోధకులు.. పురాతన పట్టణీకరణపై పరిశోధన

తన స్థాయిని మరిచి గద్దె రామ్మోహన్ విమర్శలు చేస్తున్నారని వైసీపీ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. టీడీపి హయాంలో చేసిన అభివృద్దిపై సవాల్ చే..స్తే ఏ ఒక్క టీడీపీ నేత ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు.. అభివృద్ది, సంక్షేమంపై మేము విసిరే సవాల్ స్వీకరించే దమ్ము ఎవరికి లేదు.. రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత సీఎం జగన్ ది.. గద్దె సిగ్గులేకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారు.. 2019లో రిటైనింగ్ వాల్ కడితే ఇళ్లలోకి నీరు ఎందుకు వచ్చిందో గద్దె రామ్మోహన్ చెప్పాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.

Read Also: Kajol: కాజోల్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

నాసిరకం కట్టడాలు చేసి కమిషన్లు తీసుకుంది గద్దె రామ్మోహన్ కాదా అని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఇప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన ప్రశాంతంగా పడుకునే విధంగా రిటైనింగ్ వాల్ ను వైసీపీ ప్రభుత్వం నిర్మించింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఎల్ఈడీ బల్పులు స్కాం చేసింది టీడీపి నేతలే.. పార్కులు అభివృది, డ్రెయిన్లు బాగు చేసింది కూడా సీఎం జగన్ సర్కార్.. ఎప్పుడైనా, ఎక్కడైనా అభివృద్ధిపై చర్చించే సత్తా మాకుంది.. టీడీపీ నేతలకి దమ్ముంటే చర్చకు రావాలి అని అవినాష్ సవాల్ విసిరాడు.

Show comments