NTV Telugu Site icon

Devil Movie OTT: ‘డెవిల్’ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్..!!

Devilll

Devilll

సరికొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి.. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.. ట్విట్టర్ లో ఆయన సినిమా ప్రశంసలు కురుస్తున్నాయి.. మొదటి షో తోనే దూసుకుపోతుంది.. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నాయి.. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.

‘డెవిల్’ మూవీ ఓటీటీ రైట్స్ గురించే కాదు.. శాటిలైట్ రైట్స్ గురించి కూడా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.. ఈ సినిమా అన్ని రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే.. ఈటీవీ ‘డెవిల్’ రైట్స్ను దక్కించుకుందని తెలుస్తోంది. ఈ మూవీ రైట్స్ను దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ ఎంత ఖర్చు పెట్టాయనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ సంపాదించుకోవడంతో కచ్చితంగా ఈ రైట్స్ కోసం సంస్థలు భారీగానే ఖర్చుపెట్టుంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ‘బింబిసార’ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్, సంయుక్త ఖాతాలో ఈ సినిమా కూడా హిట్ ను అందుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.. ఎన్నో కాంట్రవర్సీల మధ్య ‘డెవిల్’ చిత్రం విడుదలయ్యింది.. మొత్తానికి కళ్యాణ్ రామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Show comments