Site icon NTV Telugu

Devi Sri Prasad : మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఆశీర్వాదం తీసుకున్న రాక్ స్టార్..

Whatsapp Image 2023 08 26 At 10.41.16 Pm

Whatsapp Image 2023 08 26 At 10.41.16 Pm

రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్  ప్రకటించడం జరిగింది.. ఈ పురస్కారాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప సినిమాలు వరుస అవార్డ్ లను గెలుచుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి 10 జాతీయ అవార్డ్ లు రాగా.. అందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఏకంగా ఆరు అవార్డులు సాధించింది. ఇక పుష్ప సినిమా రెండు పురస్కారాల తో జాతీయ స్థాయిలో సత్తా చాటింది.అంతే కాదు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపిక అయింది.. ఉత్తమ ప్రేక్షకాదరణ చిత్రం గా ఆర్‌ఆర్‌ఆర్‌ జాతీయ అవార్డు ను గెలుచుకుంది. అంతే కాదు ఉత్తమ నటుడి గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎవరికీ సాధ్యం కానీ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్,ఉత్తమ క్రిటిక్ గా పురుషోత్తమ్ జాతీయ అవార్డ్ లను సాధించారు.

ఇక జాతీయ స్థాయి లో ఉత్తమ నటి అవార్డును అలియాభట్‌ గంగూబాయి కతియావాడి సినిమాకు గాను అలాగే హీరోయిన్ కృతిసనన్‌ మామి సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు ను సంయుక్తం గా గెలుచుకున్నారు. రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్‌ జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు గెల్చుకుంది.అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం. కీరవాణి గారు 2022 లో విడుదల అయిన ఆర్ఆర్ ఆర్ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. 2021లో విడుదల అయిన పుష్ప చిత్రానికి గాను దేవిశ్రీ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించారు.. జాతీయ అవార్డు అందుకున్న నేపథ్యం లో దేవిశ్రీ తన గురువు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ను కలుసుకొని ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని దేవిశ్రీ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది.

Exit mobile version