NTV Telugu Site icon

Devi Sri Prasad: సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన దేవి శ్రీ ప్రసాద్.. ఎందుకంటే?

Devisri, Cm Revanth

Devisri, Cm Revanth

దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో దేవి అనే సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఇప్పటికీ అనేక సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే హైదరాబాదులో మొట్టమొదటిసారిగా దేవిశ్రీప్రసాద్ ఒక లైవ్ కన్సర్ట్ నిర్వహించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ లైవ్ కన్సర్ట్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి దేవిశ్రీప్రసాద్ ఆహ్వానించారు.

ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలను మర్యాదపూర్వకంగా సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కలిశారు. ఈ నెల 19న జరగనున్న మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలను దేవి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా లైవ్ షోస్ చేస్తానని వెల్లడించిన దేవిశ్రీప్రసాద్.. దానిని ముందుగా హైదరాబాద్ నుంచి మొదలు పెడుతున్నానని వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో దేవి శ్రీ ప్రసాద్ లైవ్ కన్సర్ట్ జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే నిర్వాహకులు విక్రయించారు.

దేవిశ్రీ ప్రసాద్ ఇన్నాళ్లు సినీ ప్రపంచంలో సంగీత రారాజుగా తెలుగు, తమిళ్, హిందీ ఇతర భాషాల్లో సైతం సంగీతం అందించి అందరినీ ఉర్రుతలూగించారు. ఇప్పుడు లైవ్ షో ద్వారా తన సొంత ప్రజల్ని, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న అభిమానులను అలరించాడానికి సిద్దం అయ్యారు.