Devdutt Padikkal: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒకే ఒక్కడు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఆ ప్లేయర్ తాజాగా మరొక అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.. కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో వరుస సెంచరీలతో టన్నుల కొద్ది రికార్డులను తన పేరుపై నమోదు చేసుకుంటున్నా ఈ స్టార్.. తాజాగా మరొక అపూర్వ రికార్డ్‌ను తన పేరుపై లిఖించుకున్నాడు. అది ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
READ ALSO: Jana Sena Party: ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జనసేన కీలక విజ్ఞప్తి.. అది వ్యవస్థ లోపమే..!
సోమవారం ముంబయితో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ విజయ్ హజారే ట్రోఫీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు విరాట్- రోహిత్‌లకు సాధ్యం కానీ రికార్డును తన పేరున లిఖించుకొని సరికొత్త చరిత్రను లిఖించాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ (81*; 95 బంతుల్లో 11 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ పాతికేళ్ల కుర్రాడు ప్రస్తుత సీజన్‌లో 721 పరుగులతో నిలిచాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో రెండుసార్లు 700కుపైగా రన్స్ చేసిన ఫస్ట్ బ్యాటర్‌గా హిస్టరీ క్రియెట్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్‌లోనూ దేవ్‌దత్ పడిక్కల్ 7 మ్యాచ్‌ల్లో 737 పరుగులు చేశాడు.
ఇక ఈ రోజు జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ముంబై తరుఫున శామ్స్ ములానీ (86; 91 బంతుల్లో 8 ఫోర్లు) రాణించాడు. టార్గెట్‌ను ఛేదించడానికి మైదానంలోకి దిగిన కర్ణాటక.. పడిక్కల్ (81*; 95 బంతుల్లో 11 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్, కరుణ్ నాయర్ (74*; 80 బంతుల్లో) రాణించడంతో 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. దీంతో వీజేడీ పద్ధతి ప్రకారం కర్ణాటక 55 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు తెలిపారు. ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న దేవ్‌దత్ పడిక్కల్ పక్కా భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని గొప్ప బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడని పలువురు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Apple Watch Series 11: ఆపిల్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్.. ఎన్ని వేలు తగ్గిందో చూసేయండి!
