NTV Telugu Site icon

Devara : సినిమాలో ఆ సీన్స్ చూపించబోతున్న కొరటాల.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..?

Whatsapp Image 2023 07 21 At 12.37.20 Pm

Whatsapp Image 2023 07 21 At 12.37.20 Pm

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తో చేసే దేవర సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం..దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దేవర సినిమాను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.కొరటాల శివ ఈ చిత్రాన్ని గతంలో దళితులపై జరిగిన క్రూరమైన దాడుల ఆధారంగా రూపొందింస్తున్నట్లు సమాచారం.కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమాచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో దాడికి గురయ్యారు.. ఈ రియల్ ఇన్సిడెంట్‌ను దేవర చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఒక సామాజిక అంశం గురించి చక్కగా చూపిస్తూ వచ్చాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా అలాంటి సీన్స్ తీయబోతున్నట్లు సమాచారం.

Show comments