NTV Telugu Site icon

Devara : థాయిలాండ్ లో దేవర రొమాంటిక్ డ్యూయెట్ ..

Devara (1)

Devara (1)

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

Read Also :Kalki 2898 AD : కల్కి రిలీజ్ ట్రైలర్ అదిరింది.. కానీ అదొక్కటే మైనస్..?

“ఫియర్ సాంగ్” పేరుతో రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.రీసెంట్ గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెళ్లారు.అక్కడ దేవర రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.ఎన్టీఆర్ ఆ సాంగ్ షూట్ లో పాల్గొంటూనే ఫ్యామిలీతో థాయిలాండ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Show comments