NTV Telugu Site icon

Devara: నందమూరి ఫ్యాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నాగవంశీ..

Nagavamsi

Nagavamsi

యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన  దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  తోలి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దేవర  రిపీట్ ఆడియెన్స్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్  కీలక పాత్ర పోషించారు. మరోసారి ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసే సినిమా అందించడాని ఫ్యాన్స్ దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read : Surya : ‘కంగువ’ ఆడియో రీలీజ్ కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో..?

కాగా దేవర తెలుగు రాష్టాల రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసారు. కానీ దేవర తెలుగు స్టేట్స్ ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహానికి గురయ్యారు. ఈ విధమైన ప్రమోషన్స్ లేకుండానే భారీ ఎత్తున రిలీజ్ చేసారు మేకర్స్. తాజగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” అసలు నేను దేవర స్పెషల్ షోస్ కు పర్మిషన్ తెచ్చిన రోజు అసలు 550 షోస్ వేస్తానని కలలో కూడా అనుకొలేదు. కేవలం ఫ్యాన్స్ వల్లే ఇదంతా సాధ్యం అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవర సినిమాను మాత్రం ఫ్యాన్స్ ప్రాణం పెట్టి పని చేసారు. ఇన్ని షోస్ వేయగలిగాం అంటే ఫ్యాన్స్ వల్ల మాత్రమే” అని అన్నారు. మరో వైపు రిలీజ్ అయి 17 రోజులు గడచిన దేవర కలెక్షన్స్ తాజాగా రిలీజ్ అయిన సినిమాలకంటే ఎక్కువగా రాబడుతోంది.లాంగ్ రన్ లో దేవర మరిన్ని రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.