NTV Telugu Site icon

Devara : మొత్తానికి సెంచరీ కొట్టేసిన దేవర

New Project (44)

New Project (44)

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read Also:Allu Arjun : మరోసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. ఎందుకంటే ?

దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అక్కడ కూడా దేవర దండయాత్ర చేశారు. ఓటీటీలో కూడా ట్రెండింగులో నిలిచింది. ఈ నేపథ్యంలో దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ గత కొన్ని వారాలుగా పని చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.

Read Also:Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి

‘దేవర’ చిత్రాన్ని జపాన్ దేశంలో వచ్చే ఏడాది మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవల ‘కల్కి 2898 ఎడి’ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్, ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనుంది. ఇక ‘దేవర’ చిత్ర ప్రీ-సేల్స్‌ను జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే దేవర చిత్రం 100రోజులు పూర్తి చేసుకుంది. ఏపీలో ఆరు థియేటరల్లో శత దినోత్సవం పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి – పద్మజ కాంప్లెక్స్, మండపేట-రాజరత్న కాంప్లెక్స్, గుంటూరు – రామకృష్ణ థియేటర్, చిత్తూరు వి. కోట-ద్వారకా పిక్చర్స్ ప్యాలెస్, కల్లూరు-ఎంఎన్ఆర్, రొంపిచెర్ల – ఎంఎం డీలక్స్ థియేటర్లలో 100రోజులు ఆడింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ సినిమాపై దృష్టి పెట్టారు.

Show comments