Site icon NTV Telugu

JR. NTR : దేవర 2 అనౌన్స్ మెంట్ వీడియో రాబోతుంది

Devara 2

Devara 2

జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఎండ్ కార్డ్స్ లో దేవర 2 కు లీడ్ ఇస్తూ ముంగిచాడు దర్శకుడు కోరటాల శివ.

Also Read : Ajith : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ..

కాగా ఇప్పుడు దేవర 2 ను ప్లానింగ్ జరుగుతోంది. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జూలై నుంచి మొదలవుతాయని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లోగా దేవర 2 అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసాడని మరో పన్నెండు లేదా పదమూడు రోజుల్లో వీడియో రిలీజ్ కానుందని సమాచారం. బహుశా ఎన్టీఆర్ బర్త్ డే మే 20 నాడు ఉండొచ్చు. అయితే ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేస్తున్నాడట కొరటాల శివ.  దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ను పీక్స్‌లో ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈసారి సైఫ్‌తో పాటు మరో విలన్‌గా బాబీ డియోల్‌ని రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు కాస్త సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే వార్ 2 షూటింగ్ ను పూర్తి చేసిన యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాతే దేవర 2 రెగ్యులర్ షూట్ ఉండనుంది.

Exit mobile version