NTV Telugu Site icon

Google Photos: గూగుల్‌ ఫొటోస్‌లో కొత్త ఫీచర్‌.. ఇక ఆ సమస్యకు చెక్!

Google Photos Ai Info

Google Photos Ai Info

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఏఐ సాయంతో సులువుగా ఫొటోలు, వీడియోలను రూపొందిస్తున్నారు. దీంతో అసలు ఫొటో ఏదో?, ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో ఏదో? తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ‘గూగుల్‌ ఫొటోస్‌’ సిద్ధమైంది. ‘ఏఐ ఇన్ఫో’ సాయంతో ఏఐతో క్రియేట్ ఫొటోలను సులభంగా గుర్తించవచ్చని తెలిపింది.

Also Read: IND vs NZ Test: భారత్‌ ఓటమికి సీనియర్‌ ఆటగాళ్లదే బాధ్యత: కార్తీక్‌

ఏఐ ఇన్ఫో సాయంతో ఏఐ ఫొటోలను సులభంగా గుర్తించవచ్చని గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో స్పష్టం చేసింది. ఏఐ టూల్స్‌ సాయంతో ఫొటోలు ఎడిట్‌ చేస్తే మాత్రమే గుర్తించవచ్చని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో ఫొటోలకు ఎంచుకొని.. కిందకు స్క్రోల్‌ చేయగానే డీటెయిల్స్ (Details) సెక్షన్‌ ఉంటుంది. అందులో ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో అయితే ‘Edited with Google AI’ అని సూచిస్తుంది. ఆ ఫొటో ఏఐతో క్రియేట్ ఫొటోలు. గూగుల్‌ ఫొటోస్‌ ఇటీవలే మ్యాజిక్‌ ఎడిటర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌ సహా ఇతర ఏఐ టూల్స్‌ను తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.