NTV Telugu Site icon

IFFI GOA: అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు సిద్దమవుతున్న ‘వికటకవి’, ‘డిస్పాచ్’

International Film Festival Of India

International Film Festival Of India

IFFI GOA: మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ సిరీస్, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ లు అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతోన్నారు.ఈ నేపథ్యంలో ‘డిస్పాచ్’ సిరీస్ నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయబోతుండగా.. నవంబర్ 23న నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ని ప్రదర్శించనున్నారు. ఇకపోతే, కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, షహానా గోస్వా, అర్చిత అగర్వాల్ లు ముఖ్య పాత్రలలో నటించారు. ఇందులో మనోజ్ బాజ్‌పేయి ఓ అనుభవజ్ఞుడైన క్రైమ్ జర్నలిస్ట్ పాత్రను పోషించగా.. అధికారం, నైతికత, వ్యక్తిగత సంఘర్షణల వలయంలో చిక్కుకున్న వ్యక్తి ప్రయాణంగా ఈ కథ కొనసాగుతుంది.

Also Read: Rashi Khanna: సౌత్ ఇండస్ట్రీపై మనస్సు చంపుకోలేపోతున్న ఢిల్లీ బ్యూటీ

ఇక మరోవైపు ‘వికటకవి’ గురించి చూస్తే.. ఓ రహస్య ప్రదేశమైన అమరగిరి నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ డిటెక్టివ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కింది. 1970ల కాలం నాటి తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ అప్పటి సాంస్కృతిక, ఆచార, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. నవంబర్ 20 నుండి 28వ తేదీ వరకు గోవాలో 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమం జరుగనుంది. ఈ క్రమంలో ఈ రెండు వెబ్ సిరీస్‌లను అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ‘డిస్పాచ్’ డైరెక్టర్ కను బెహ్ల్ మాట్లాడుతూ.. ‘మా సిరీస్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శిస్తుండటం చాలా ఆనందంగా ఉందని, ఇంత గొప్ప అనుభూతి మరొకటి లేదని అన్నారు. తాను మొదటిసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొంటున్నానని, ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

అలాగే ‘వికటకవి’ దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ..‘ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వికటకవి ప్రీమియర్‌ను ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి ప్రతిష్టాత్మక వేదికపై ఏ దర్శకుడికైనా తమ పనితనాన్ని ప్రదర్శించడం గొప్ప గౌరవం అని అన్నారు. ఈ సిరీస్ లో సాంస్కృతిక మూలాలు, గ్రిప్పింగ్ మిస్టరీ ఉంటుందని, ప్రత్యేకించి తెలంగాణలోని స్థానిక చరిత్రను ప్రపంచ ప్రేక్షకులకు అందిస్తుందని ఆయన అన్నారు.