Ghaati : టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క నాలుగో సినిమా చేస్తుంది. అనుష్క బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also:Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన రిషబ్ పంత్
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కాగా ఈ సినిమా నుంచి ‘దేసీ రాజు’ అనే పాత్రను సంక్రాంతి కానుకగా రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పాత్రలో ఓ ప్రముఖ యాక్టర్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు ఏర్పడటంతో ఇప్పుడు ఈ ‘దేసీ రాజు’ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యా సాగర్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.