దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్‌వుడ్ కన్నుమూశాడు. ఈయన ఇంగ్లాండ్ తరఫున 86 టెస్టుల్లో 297 వికెట్లను పడగొట్టాడు. ఇప్పటికీ ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా ఈయన చలామణిలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఆరో అత్యధిక స్పిన్ బౌలింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈయన ఇంగ్లాండులో జరిగే కౌంటిలలో 1963 నుంచి 1982 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సుదీర్ఘ కౌంటింగ్ క్రికెట్లో 900 కు పైగా మ్యాచులు ఆడిన ఆయన 2523 వికెట్లను పడగొట్టాడు. 17 ఏళ్ల వయసులోనే అతడు కౌంటీలకి ఆడటం మొదలుపెట్టాడు.
Also read: KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ పర్యటన.. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరు
అలా కేవలం 25 ఏళ్ల వచ్చే సమయానికి ఆయన ఏకంగా 1000 ఫస్ట్ క్లాస్ వికెట్లను పడగొట్టి రికార్డులకెక్కాడు. ఈయన ఒక్క సీజన్లో 100కు పైగా వికెట్లను తీసిన వాడిగా పదిసార్లు రికార్డు సృష్టించాడు. ఇకపోతే 1966 సీజన్ లో ఆయన ఆడిన కౌంటీలో ఏకంగా 157 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇక అలాగే 1966 ,1967 ,1978 , 1979 సంవత్సరంలో ఆయన ఇంగ్లాండ్ తరఫున లీడ్ బౌలర్ గా కొనసాగాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కూడా 1969 సెప్టెంబర్ నుండి 1973 ఆగస్టు వరకు ఐసీసీ ప్రకటించే టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో కొనసాగాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే కాకుండా వన్డేలో సైతం ఇంగ్లాండు జట్టు తరఫున ఈయన ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో కేవలం 26 మ్యాచులు ఆడిన ఆయన 32 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
1975లో జరిగిన వరల్డ్ కప్ లో కూడా ఇంగ్లాండ్ తరఫున ఈయన ఆడాడు. 2009లో ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించే అవార్డులో ‘హాల్ ఆఫ్ ఫేమర్’ గా ఈయన ఎన్నికయ్యారు. అలాగే 2006లో ఇంగ్లాండ్లోని కెంట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా.. ఆపై 2008లో ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈయన మరణం పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన సంతాపాన్ని ప్రకటన రూపంలో విడుదల చేశారు.
