NTV Telugu Site icon

Derek Stirling: న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మృతి!

Derek Stirling Dies

Derek Stirling Dies

New Zealand Former Pacer Derek Stirling Dead: న్యూజిలాండ్ మాజీ పేసర్‌ డెరెక్ స్టిర్లింగ్ మృతి చెందారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన వెల్లింగ్టన్‌ హేస్టింగ్స్‌లోని తన సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. డెరెక్ స్టిర్లింగ్ మృతి పట్ల న్యూజిలాండ్‌ క్రికెట్‌ సంతాపం వ్యక్తం చేసింది. స్టిర్లింగ్ మృతి పట్ల కివీస్ క్రికెటర్స్ సంతాపం తెలుపుతున్నారు.

డెరెక్ స్టిర్లింగ్ 1984 నుంచి 1986 మధ్య న్యూజిలాండ్‌ తరపున 6 టెస్టులు, 6 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 13, వన్డేలో 6 వికెట్స్ తీశారు. రిచర్డ్ హ్యాడ్లీ, ఎవెన్ చాట్‌ఫీల్డ్ మరియు లాన్స్ కెయిర్న్స్ వంటి కివీ పేసర్ల అద్భుత ప్రదర్శనల మధ్య స్టిర్లింగ్ ప్రతిభ వెలికిరాకుండా పోయింది.
లాన్స్, చాట్‌ఫీల్డ్, హ్యాడ్లీలు అద్భుతంగా రానిస్తున్న సమయంలో స్టిర్లింగ్ అరంగేట్రం చేయడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఆయనకు మంచి రికార్డు ఉంది. డొమాస్టిక్‌ క్రికెట్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ (1981 నుండి 1988 వరకు), వెల్లింగ్టన్‌కు (1988 నుండి 1992 వరకు) ప్రాతినిధ్యం వహించిన స్టిర్లింగ్.. 84 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 206 వికెట్లు పడగొట్టారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 65 గేమ్‌లలో 90 వికెట్లు తీశారు.

Also Read: Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ

డెరెక్ స్టిర్లింగ్ రైట్ ఆర్మ్ సీమర్. స్టిర్లింగ్‌కు గ్రాస్‌రూట్ గేమ్ అంటే చాలా ఇష్టం. గత 20 సంవత్సరాలుగా వివిధ కోచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పాత్రలలో బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్‌ తర్వాత హాక్స్ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా స్టిర్లింగ్ పని చేశారు. న్యూజిలాండ్‌ యువ క్రికెటర్లను తయారు చేయడంలో ఆయన తన వంతు పాత్రపోషించారు.