Derek Stirling: న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Former Pacer Derek Stirling Dead: న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్ మృతి చెందారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన వెల్లింగ్టన్ హేస్టింగ్స్‌లోని తన సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. డెరెక్ స్టిర్లింగ్ మృతి పట్ల న్యూజిలాండ్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. స్టిర్లింగ్ మృతి పట్ల కివీస్ క్రికెటర్స్ సంతాపం తెలుపుతున్నారు.
డెరెక్ స్టిర్లింగ్ 1984 నుంచి 1986 మధ్య న్యూజిలాండ్ తరపున 6 టెస్టులు, 6 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 13, వన్డేలో 6 వికెట్స్ తీశారు. రిచర్డ్ హ్యాడ్లీ, ఎవెన్ చాట్‌ఫీల్డ్ మరియు లాన్స్ కెయిర్న్స్ వంటి కివీ పేసర్ల అద్భుత ప్రదర్శనల మధ్య స్టిర్లింగ్ ప్రతిభ వెలికిరాకుండా పోయింది.
లాన్స్, చాట్‌ఫీల్డ్, హ్యాడ్లీలు అద్భుతంగా రానిస్తున్న సమయంలో స్టిర్లింగ్ అరంగేట్రం చేయడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఆయనకు మంచి రికార్డు ఉంది. డొమాస్టిక్ క్రికెట్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్ (1981 నుండి 1988 వరకు), వెల్లింగ్టన్‌కు (1988 నుండి 1992 వరకు) ప్రాతినిధ్యం వహించిన స్టిర్లింగ్.. 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 206 వికెట్లు పడగొట్టారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 65 గేమ్‌లలో 90 వికెట్లు తీశారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ
డెరెక్ స్టిర్లింగ్ రైట్ ఆర్మ్ సీమర్. స్టిర్లింగ్‌కు గ్రాస్‌రూట్ గేమ్ అంటే చాలా ఇష్టం. గత 20 సంవత్సరాలుగా వివిధ కోచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పాత్రలలో బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్ తర్వాత హాక్స్ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా స్టిర్లింగ్ పని చేశారు. న్యూజిలాండ్ యువ క్రికెటర్లను తయారు చేయడంలో ఆయన తన వంతు పాత్రపోషించారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!