Site icon NTV Telugu

Kolagatla Veerabhadra Swamy: చంద్రబాబు పొత్తులు లేకుండా ఎప్పుడూ గెలవలేదు.. ఇప్పుడు పొత్తులు ఉన్నా సాధ్యంకాదు..!

Kolagatla Veerabhadra Swamy

Kolagatla Veerabhadra Swamy

Kolagatla Veerabhadra Swamy: టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై సెటైర్లు వేశారు.. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎప్పుడు విజయం సాధించలేదన్న ఆయన.. కానీ, ఈ సారి పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబు విజయం సాధించలేరని జోస్యం చెప్పారు.. ఇక, ముఖ్యమంత్రి కావాలనుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు ఎమ్మేల్యే అయితే చాలు అన్నట్లుగా పోటీ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు.. బీజేపీకి రాష్ర్టంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దోరకని పరిస్థితి ఉందన్నారు.. మూడు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధమే లేదన్నారు.. కాంగ్రెస్‌ పార్టీని గద్దే దింపడానికి ఆవిర్భవించేందే వైసీపీ అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.

Read Also: Supreme Court: ఎస్బీఐకి సుప్రీంకోర్టు చివరి గడువు.. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతి రహస్యం చెప్పాల్సిందే !

Exit mobile version