NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: ఏనుగుల నుంచి రక్షణకు చర్యలు.. ‘కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటకతో చర్చలు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఏనుగులు ఎప్పటికప్పుడు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా అటవీప్రాంతాలకు దగ్గరగా ఉన్న పంట పొలాలను ధ్వంసం చేయడం.. గ్రామాల్లోకి చొచ్చుకొచ్చిన ఘటనలుతో స్థానికులు భయాందోళలనకు గురయ్యారు.. అయితే, వాటి నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఏనుగుల వల్ల పంటలు ధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించిన పవన్.. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం, జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకులకు దిశానిర్దేశం చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్‌

అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించిన పవన్‌ కల్యాణ్‌.. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యలను ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉన్నాయన్నారు కనీసం, అయిదు ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చు అన్నారు. స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల గురించి చర్చిస్తాను. వారికి మన సమస్యను వివరిస్తాను. ఆ రాష్ట్రం నుంచి ఆ తరహా ఏనుగులు తీసుకు వచ్చేందుకు కృషి చేద్దాం అన్నారు. వన్య ప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకొనే విధానాలు విడిచిపెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అది చట్ట ప్రకారం నేరమని కూడా తెలియచేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.