NTV Telugu Site icon

Pawan Kalyan: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని.. 21 మందితో.. 21న..

Pawan

Pawan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అడుగుపెట్టారు.. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుగులేని విజయాన్ని అందుకున్న ఆయన.. ఈ రోజు, రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలుకు హాజరయ్యారు.. ఆయనకు మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అయితే, అసెంబ్లీలో పవన్‌ కల్యాణ్ అడుగుపెట్టిన రోజుకు ఓ ప్రత్యేక ఉందనే చెప్పాలి.. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది జనసేన పార్టీ.. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు దక్కగా.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి రికార్డు సృష్టించారు జనసేనాని.. అంటే.. 21 సీట్లు తీసుకొని.. 21 ఎమ్మెల్యేలను గెలిపించుకుని.. ఆ 21 మంది ఎమ్మెల్యేలతో.. 21వ తేదీన అసెంబ్లీలో అడుగుపెట్టారు..

Read Also: ESI Hospital: దిక్కున్న చోట చెప్పుకోండి.. ఈఎస్ఐలో రోగులపై సిబ్బంది జులుం

ఇక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో చేరిన జనసేన పార్టీ కీలక శాఖలు దక్కించుకున్న విషయం విదితమే.. ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన శాఖలను తీసుకున్నారు కొణిదెల పవన్ కల్యాణ్‌.. తమ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కీలకమైన శాఖలు దక్కించుకున్నారు.. కాగా, 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలోని నోవాటెల్ లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించాడు. ఇక, అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు.. ఇక, 2014 సాధారణ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీతో, చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, జనసేన ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.. కానీ, టీడీపీ-బీజేపీ విజయం వెనుక జనసేనాని కృషి మరులేనిది.. ఆ తర్వాత బీజేపీ-టీడీపీకి దూరమైన ఆయన.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.. ఆ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీఎస్సీ కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసింది జనసేన పార్టీ.. ఈ ఎన్నికల్లో పవన్‌.. గాజువాక మరియు భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే విజయం సాధించినా.. ఆయన కాల క్రమంలో పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటూ.. చివరకు వైసీపీకి దగ్గరయ్యారు..

Read Also: Shah Rukh Khan Mansion: అమెరికాలో షారుఖ్ ఖాన్ మాన్షన్‌.. ఒక రాత్రికి 2 లక్షలు!

మరోవైపు.. 2023లో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను ఎత్తిచూపేందుకు పవన్‌ కల్యాణ్‌.. వారాహి యాత్ర ప్రారంభించారు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత పొత్తుతో ముందుకు వెళ్తామని ప్రకటించారు.. మార్చి 2024లో, టీడీపీ శాసనసభ ఎన్నికలు మరియు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్డీఏలో తిరిగి చేరింది, దీనిని సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో త్రి-పార్టీ కూటమి లేదా కుటమిగా మార్చింది. ఈ కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కృషి మరవులేనిది.. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా జనసేన పార్టీ రికార్టు సృష్టించింది.. పిఠాపురం నియోజకవర్గంలో 70,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు పవన్‌.. ఆ తర్వాత ప్రభుత్వంలో చేరి ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దక్కించుకున్నారు.. ఈ రోజు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు పవన్‌ కల్యాణ్‌.