NTV Telugu Site icon

Deputy CM Narayana Swamy: నా కుమార్తెను ఎన్నికల్లో గెలిపించండి..

Narayanaswamy

Narayanaswamy

Deputy CM Narayana Swamy: దయచేసి తన కూతురు కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలను కోరారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో నూతన సచివాలయం, పాలశీతలీకరణ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన కూతురిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఇప్పుడు తన మైండ్ ఫ్రీ అయిపోయిందని.. తాను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదని, ఎవరికీ తలవంచననని నారాయణ స్వామి అన్నారు. తనకు మంచి జరిగినా, చెడు జరిగిన నారాయణస్వామి డబ్బు తీసుకొని పనిచేశాడని ఎవరూ చెప్పలేరన్నారు. అలా ఎవరైనా డబ్బు తీసుకున్నానని చెప్పమనండి.. తాను, తన కుమార్తె కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన అన్నారు. సీఎం జగన్‌ తన కోరికను తీర్చాడని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తన కుమార్తె బాగా చదువుకుందని.. నీతిమంతురాలుగా ఉంటూనే ఎమ్మెల్యేగా పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా అయిన ఒక సంవత్సరం లోపల నీతివంతురాలా కాదా అని తేలిపోతుందన్నారు. ఒకవేళ ఆమె అవినీతి వంతురాలైతే నేనే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయిస్తానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.

Read Also: TDP: పెనమలూరు సీటుపై టీడీపీలో వీడని చిక్కుముడి

వైఎస్సార్‌సీపీ గంగాధర నెల్లూరు ఇన్‌చార్జిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పెద్ద కూతురు కల్లత్తూర్ కృపాలక్ష్మి నియమితులైన సంగతి తెలిసిందే. . ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం జీడీ నెల్లూరు నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన పెద్ద కుమార్తె కృపాలక్ష్మి తండ్రి రాజకీయాలకు చేదోడువాదోడుగా నిలిచారు. ఫిజియో థెరపీలో డిగ్రీ పొందిన ఈమె ప్రస్తుతం న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. తాజాగా నారాయణస్వామి విన్నపం మేరకు కృపాలక్ష్మిని వైఎస్సార్‌సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు.

నా కుమార్తెను ఎన్నికల్లో గెలిపించండి : Deputy CM Narayana Swamy l NTV