చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సచివాలయంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం పై హాట్ కామెంట్ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి వచ్చి చంద్రబాబుకు ఆయన కొడుకు కోవర్టుగా పనిచేయడానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాలుగా చెప్తున్నారు.. కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబు కిడ్నీ చెడిపోయింది అని ఆయన భార్య భువనేశ్వరి ఆరోగ్యం క్షీణించిందని అంటున్నారు అంటూ డిప్యూటీ సీఎం ఆరోపించారు.
Read Also: Good News: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్
నారా చంద్రబాబు నాయుడికి జైలులో అన్నం పెడుతున్నది ఎవరు గవర్నమెంట్ పంపిస్తున్నదా?.. భార్య భువనేశ్వరి కదా అన్నం పంపిస్తున్నది అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. జైల్లో దోమలు కొరుకుతున్నది అంటున్నారు దోమల ద్వారా మేము ఏమైనా విషయం పంపిస్తున్నామా.. ఎన్టీ రామారావును ఏవిధంగా చంపి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అది నిజమా కాదా చెప్పమనండి.. నేను చెప్పింది తప్పు అని అంటే నా మాటలు వెనక్కి తీసుకుంటా అని ఆయన పేర్కొన్నారు. అది కరెక్ట్ అయితే నేను చెప్పింది కూడా కరెక్టే అని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పంపించేసి నారా లోకేశ్ ను ముఖ్యమంత్రి చేయాలనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. వాళ్లు ఒక్క స్టేట్మెంట్ కూడా నిజం చెప్పడం లేదు అని ఆయన ఆరోపించారు.