సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని.. పదిసార్లు టెండర్లు పిలిచినా, పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని మంత్రి కోమటిరెడ్డి ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
Komuravelli Railway Station: మల్లన్న భక్తులకు శుభవార్త.. కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్
అనంతరం రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రోడ్డు నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పీపీటీ రూపంలో వివరించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు సంబంధించి ఆలైన్‌మెంట్‌పై చర్చించారు. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఆలైన్‌మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఇష్టం వచ్చినట్టుగా కాకుండా క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఆలైన్‌మెంట్ ఉండాలని సూచించారు.
Sreemukhi : రెట్రో స్టైల్ లుక్ లో అదరగొడుతున్న శ్రీముఖి..
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని.. నల్గొండ, హైదరాబాద్ లో కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టడం, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్ యూబీలు, వీయూబీ బ్రిడ్జ్ ల నిర్మాణానికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కేటాయించడం.. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్ వర్క్ పెంచేందుకు అవసరమున్న నిధులు విడుదల చేయాలని చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో సీఐఆర్ఆఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాలకు భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆర్ధిక మంత్రి అంగీకారం తెలిపారు. ఇవే కాకుండా చేప ప్రసాదం పంపిణీ, బోనాల జాతర, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల ఏర్పాటుకు తాత్కాలిక అవసరాల కోసం కొంత బడ్జెట్ అవసరముంటుందని.. అందుకు సరిపడా నిధులు కేటాయించాలని కోమటిరెడ్డి కోరారు.