Site icon NTV Telugu

Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి గద్దర్ నివాసానికి భట్టి విక్రమార్క

Batti

Batti

సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి దగ్గర తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. ఇక, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను భట్టి విక్రమార్క పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భట్టి విక్రమార్కను చూసి గద్దర్ భార్య గుమ్మడి విమల కంట తడి పెట్టుకొని భావోద్వేగానికి గురైయింది.

Read Also: Farmers Protest : జర్మనీలో ట్రాక్టర్లతో రైతుల నిరసన.. యూరప్‌ దేశాలపై ప్రభావం

ఇక, గద్దర్ భార్య విమలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓదార్చారు. గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ఆయన ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పొడుస్తున్న పొద్దుతో.. నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని ఆహింసాయుతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దమ్మ అయిన సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్ర భాగాన నిలిచిన ప్రజా యుద్ధనౌక, తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య గుమ్మడి విమల, కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెలలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించారు.

Exit mobile version