NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్‭వేగాస్‌ మైన్ ఎక్స్‭పోలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క..

Batti

Batti

Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్‭వేగాస్‌ జరుగుతున్న మైన్ ఎక్స్ పోలో 2 వేల‌కు పైగా ఆధునిక యంత్ర త‌యారీ సంస్థ‌లు పాల్గొన్నాయి. 121 దేశాల నుండి 40 వేల మంది ప్రతినిధులు హరయ్యారు. మైన్ ఎక్స్ సంద‌ర్భంగా స‌ద‌స్సులో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌సంగించ‌నున్నారు. మూడు రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌కు అత్యాధునిక‌, భారీ మైనింగ్ ఖ‌నిజ ఉత్ప‌త్తి యంత్రాలు ఉండనున్నాయి. తెలంగాణలో మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగం కోసం ఆయన అక్కడ ప్రసంగచబోతున్నారు. అలాగే ఇత‌ర రంగాల్లో అవ‌కాశాల‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు నేతృత్వంలో అధ్య‌య‌నం చేయనున్నారు.

Case File: ముగ్గురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు..

డిప్యూటీ సీఎం వెంట‌ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, అలాగే ఆర్థిక‌, ప్ర‌ణాళిక శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి శ్రీ కృష్ణ భాస్క‌ర్‌, సింగరేణి సీఎండీ శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు. మైనింగ్ సాంకేతిక‌త‌ల‌పై అధ్య‌య‌నానికి తొలిసారిగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉన్న‌త స్థాయి బృందం అమెరికాకు వెళ్ళింది. క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో అన్వేష‌ణ అవ‌కాశాలు.. విస్త‌ర‌ణ‌పైనా దృష్టి సారించనున్నారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు.