NTV Telugu Site icon

Dengue Fever Alert: డెంగ్యూ, మలేరియా ముప్పు మొదలైంది.. నేటి నుంచే ఈ ఆహారపదార్థాలను తీసుకోండి

Dengue

Dengue

Dengue Fever Alert: వానాకాలం సీజన్ మొదలైంది. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా వాతావరణంలో దోమల వ్యాప్తి పెరుగుతుంది. దీని కారణంగా దోమల ద్వారా వచ్చే వ్యాధులు కూడా పెరుగుతాయి. మొదట దోమలను నివారించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఈ వ్యాధులు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని సులభంగా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి. డెంగ్యూ కారణంగా ఒక వ్యక్తి తీవ్రమైన జ్వరం, తల,వెన్నునొప్పి, చర్మంపై దద్దుర్లు మొదలైన వాటితో బాధపడుతాడు. దీనితో పాటు ప్లేట్‌లెట్స్ కూడా తగ్గడం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం ఆరోగ్యానికి ప్రమాదకరం. రోగి తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది అతని ఆరోగ్యాన్ని వేగంగా మెరుగుపరుస్తుంది. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఏం తినాలో తెలుసుకుందాం.

ఆమ్ల ఫలాలు
నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి పుల్లని పండ్లను ఇవ్వండి. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచేవి. ఈ పండు శరీరంలో తెల్లరక్తకణాల ఏర్పాటుకు సహకరిస్తుంది. దీని వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

Read Also:Salaar Teaser: ‘సలార్‌’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!

మెంతులు
మెంతి గింజలు డెంగ్యూలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది తేలికపాటి ట్రాంక్విలైజర్‌గా పనిచేస్తుంది. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

బ్రోకలీ
బ్రోకలీ విటమిన్ కె కు గొప్ప మూలం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. బ్లడ్ ప్లేట్‌లెట్స్‌ని పెంచడంలో ఇది చాలా సహాయపడుతుంది. డెంగ్యూ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవాలి.

పసుపు
పసుపులో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి, మీరు పాలలో పసుపు కలిపి క్రమం తప్పకుండా త్రాగాలి.

దానిమ్మ
దానిమ్మలో అవసరమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. మీరు క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే అది అలసటను తొలగిస్తుంది. దీనిలో ఐరన్ కావాల్సినంత ఉంటుంది. రక్తంలో ప్లేట్‌లెట్లను పెంచడానికి దానిమ్మను ఆహారంలో చేర్చుకోవచ్చు.

Read Also:Ap Rains : ఏపీలో భారీ వర్షాలు..ఆ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు..

వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల వాపు, జ్వరం, గొంతునొప్పి మొదలైన సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు డెంగ్యూ నుండి కోలుకోవడానికి సహాయపడతాయి.

పెరుగు
పెరుగు జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. ఇది రోగనిరోధక వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఇది ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది, ఇది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Show comments