Assam MLA: తాజ్‌మహల్, కుతుబ్మినార్లను వెంటనే కూల్చివేయాలని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మీ కోరారు. ఈ రెండు స్మారక కట్టడాల స్థానంలో ప్రపంచంలోనే అందమైన దేవాలయాలు నిర్మించాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించింది. తద్వారా 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంతో సహా వివిధ తరగతులకు సంబంధించిన పుస్తకాలను సవరించింది. ఈ క్రమంలోనే అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుర్మీ.. ప్రధాని నరేంద్ర మోడీకి విచిత్రమైన విజ్ఞప్తి చేశారు. తాజ్ మహల్, కుతుబ్ మినార్ వంటి కట్టడాలను కూల్చివేయాలని అన్నారు.
తాజ్‌మహల్, కుతుబ్మినార్లను వెంటనే కూల్చివేయాలని ప్రధానిని కోరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ రెండు స్మారక కట్టడాల స్థానంలో ప్రపంచంలోనే అందమైన దేవాలయాలు నిర్మించాలి. ఆ రెండు దేవాలయాల నిర్మాణశైలి ఏ ఇతర స్మారక చిహ్నానికి దగ్గరగా ఉండకూడదు. దేవాలయాల నిర్మాణానికి కనీసం ఏడాదిన్నర జీతాన్ని విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కుర్మీ తెలిపారు.
Read Also: Covid 19: దేశంలో భారీగా కరోనా కేసులు.. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం..
దేశంలోని NCERT సిలబస్‌ని అనుసరించే అన్ని పాఠశాలలకు తాజా మార్పు వర్తిస్తుంది. ప్రస్తుత అకడమిక్ సెషన్ 2023-2024 నుండి మార్పులు వర్తిస్తాయని NCERT తెలిపింది. ముఖ్యంగా, 12వ తరగతి సిలబస్‌లో తాజా మార్పులలో, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అధ్యాయాలను NCERT చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి తొలగించింది, అయితే హిందీ పుస్తకం నుండి కొన్ని పద్యాలు, పేరాగ్రాఫ్‌లు కూడా తొలగించబడ్డాయి.
Read Also: Bandi sanjay: బండి అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్.. బొమ్మల రామారంలో అదుపులో బీజేపీ నేతలు
‘టాపిక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ-పార్ట్ 2’ అనే పాఠ్యపుస్తకంలోని మొఘల్ ఆస్థానం, రాజులు, వారి చరిత్రకు సంబంధించిన అధ్యాయాలను సిలబస్ నుంచి తొలగించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రూప్‌జ్యోతి కుర్మీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఒకప్పుడు తీవ్ర విమర్శకుడు., జూన్ 2021లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడం గమనార్హం. గతంలో ఆయన మరియాని అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందారు. బిజెపిలో చేరిన తర్వాత, కుర్మి అదే నియోజకవర్గం నుండి తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.