Delivery Boy Kiss woman : సాధారణంగా డెలివరీ బాయ్స్ తన కస్టమర్లతో సభ్యతగా వ్యవహరిస్తుంటారు. ఎంతో వినమ్రతతో వారు డెలివరీ చేసిన వస్తువులను ఇచ్చి రేటింగ్ ఇవ్వమని అడిగే వారిని చూసుంటాం. కానీ ఇక్కడో డెలివరీ బాయ్ ఓ కస్టమర్ పట్ల అసభ్య ప్రవర్తించి జాబ్ పోగొట్టుకున్నాడు. బ్రిటన్‌లోని మెరిడెన్ ఎస్టేట్‌లో నివసిస్తున్న మహిళ ఆన్‌లైన్లో కొన్ని సరుకులకు ఆర్డర్ పెట్టింది. కాసేపటికి తను ఆర్డర్ పెట్టిన సరుకులు పట్టుకొని డెలివరీ బాయ్ వచ్చాడు. సదరు డెలివరీ బాయ్ (60 ఏళ్ల వ్యక్తి) వద్ద నుండి సరుకులు రిసీవ్ చేసుకుని ఆమె లోపలికి వెళ్లిపోయింది.
Read Also: Rupee: షాకింగ్.. భారీగా పడిపోనున్న రూపాయి మారకం విలువ
Read Also: Baba Ramdev: బట్టల్లేకున్నా మహిళలు బాగుంటారు.. రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు
కొన్ని సెకెన్లలోనే మళ్లీ కాలింగ్ బెల్ మోగడంతో ఆమె తలుపు తీసింది. ఎదురుగా మళ్ళీ డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు. ఏదైనా ఇవ్వడం మరిచిపోయాడేమో అనుకుందామె. ‘దయచేసి ఏమీ అనుకోకుండా మీ వయసెంతో చెబుతారా’ అని అడిగాడు. నా వయసుతో ఇతనికేం పని అనుకుంటూనే… 33ఏళ్లని సమాధానమిచ్చింది. ఆమె అలా చెప్పగానే సదరు డెలివరీ బాయ్ చటుక్కుని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టుకోబోయాడు. అయితే అతని తీరుపై అప్పటికే అనుమానంగా ఉన్న ఆమె వేగంగా తప్పించుకుంది. అంతే అతన్ని విడిపించుకుని వేగంగా లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. ఇదంతా ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన షాక్ అయిన ఆమె కాసేపటికి తేరుకుని సదరు కంపెనీ వారిపై విరుచుకుపడింది.మహిళ ఫిర్యాదుకు స్పందించిన టెస్కో కస్టమర్ కు తమ డెలివరీ బాయ్ చర్యలకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో పాటు డెలివరీ బాయ్‌పై అంతర్గత విచారణ కూడా ప్రారంభించారు. ఈ ఘటనపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.