NTV Telugu Site icon

Delhi Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఆందోళనలో ప్రజలు

Delhi

Delhi

ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి తీవ్రంగా పడిపోయింది. గాలి నాణ్యత 480కి చేరుకుంది అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. ఆనంద్ విహార్‌లో AQI 450, ఆర్కేపురంలో 413, పంజాబీ బాగ్‌లో 418, ఐటీఓలో 400గా ఉంది. అయితే, రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కాలుష్యంతో పాటు పొగమంచు కూడా కనిపిస్తుంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం వేగంగా పెరుగుతోంది. నవంబర్ 10న ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కురిసిన వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటే, నవంబర్ 12 తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణం మరోసారి విషమంగా మారింది. ఒక వైపు, దీపావళి తర్వాత గాలి నాణ్యత ‘పేలవమైన’ స్థాయికి పడిపోయింది. ఎన్సీఆర్ లోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది.

Read Also: Saripodha Shanivaaram : శనివారం యాక్షన్ మొదలుపెట్టిన నాని..

అయితే, దేశ రాజధానిలోని వాతావరణంలో వచ్చే మూడు రోజుల పాటు పొగమంచు కమ్మే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం.. రాబోయే మూడు రోజులలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుందని భావిస్తున్నారు. ఇక, ఢిల్లీలో నవంబర్ 2 నుంచి ప్రజలు విపరీతమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి రాజధానిలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు కాలుష్యం తక్కువగా నమోదైంది. కానీ, మొదట్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా అక్టోబర్‌లో సాధారణం కంటే కాలుష్యం ఎక్కువగా నమోదైంది. గాలి వేగం తగ్గడం, వాయువ్య దిశ నుంచి గాలి రావడంతో ఢిల్లీలోని ఏక్యూఐ ఊపిరి పీల్చుకుంది. ముఖ్యంగా గత మూడు రోజులుగా ఢిల్లీ ప్రజలకు అత్యంత దారుణంగా ఉంది.