భారత దేశ ప్రజలను ప్రస్తుతం దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి వణికిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు పొగమంచు, చలి తీవత్ర పెరుగుతోంది. నేడు దేశంలోని 20కి పైగా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మణిపూర్ సహా 20 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం.
Also Read: Delhi Weather: ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత.. నేడు తేలికపాటి వర్షం!
దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రైలు, విమాన సర్వీసులలో అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోనే 80 రైళ్ల రాకపోకలపై పొగమంచు ప్రభావం చూపింది. రైళ్లు 1-6 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు-నిజాముద్దీన్, భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని, కాన్పూర్-న్యూఢిల్లీ శ్రమశక్తి, ప్రయాగ్‌రాజ్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైళ్లు లేటుగా నడుస్తున్నాయి. 50కి పైగా విమానాలు కూడా ఆలస్యంగా ఆరంభం అవుతున్నాయి. 15 నిముషాల నుంచి 30 నిమిషాల పాటు ఆలస్యమవుతున్నాయి.