Shraddha Walker Case: తన జీవిత భాగస్వామిని హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరో 14 రోజులు పొడిగించింది. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. అతన్ని వ్యక్తిగతంగా హాజరుపరచాల్సి ఉంది, అయితే భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయం మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 18న శ్రద్దను చంపినందుకు అభియోగాలు మోపబడి ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. నివేదికల ప్రకారం, నిందితుడిని సాకేత్ కోర్టులో సంబంధిత జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నందున తీహార్ జైలు అథారిటీ తన 3వ బెటాలియన్‌కు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆదేశించింది.
అఫ్తాబ్ తన సెల్‌ను మరో ఇద్దరు ఖైదీలతో పంచుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కేసు దర్యాప్తులోని ఓ అధికారి అఫ్తాబ్ చాలా తెలివైనవాడని.. కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అంతకుముందు డిసెంబరు 1న అఫ్తాబ్‌కు నార్కో టెస్టు నిర్వహించగా, అతను తన ప్రియురాలిని హత్య చేసినట్లు అంగీకరించారు. పరీక్ష సమయంలో, అతను శ్రద్ధా దుస్తులను ఎక్కడ పారవేశాడో కూడా వెల్లడించాడు. తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నిపుణులు కూడా పోస్ట్-నార్కో పరీక్ష సమయంలో అఫ్తాబ్‌తో సంభాషించారు.
Punjab Blast Mastermind: 2019 పంజాబ్ పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
మరోవైపు శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ ఈరోజు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశం కానున్నారు. అనంతరం బాధితురాలి తండ్రి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అఫ్తాబ్ శ్రద్ధను గొంతు కోసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి, దానిని 300 లీటర్ల ఫ్రిజ్‌లో దాదాపు మూడు వారాల పాటు మెహ్రౌలీలోని తన ఇంట్లో ఉంచి, అర్ధరాత్రి దాటి చాలా రోజుల పాటు నగరం అంతటా పారేశాడు. ఈ కేసులో సాక్ష్యాధారాల కోసం ఢిల్లీ పోలీసులు మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లకు బృందాలను కూడా పంపారు. అధికారుల ప్రకారం.. ముంబైని విడిచిపెట్టిన తర్వాత, శ్రద్ధ, అఫ్తాబ్ హిమాచల్ ప్రదేశ్‌తో సహా అనేక ప్రదేశాలకు ప్రయాణించారు. ఆ పర్యటనలలో ఏదైనా కారణం వల్ల భాగస్వామిని చంపడానికి అఫ్తాబ్‌ను ప్రేరేపించిందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు ఈ ప్రదేశాలను సందర్శించారు.