Delhi : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కుప్పకూలిన పాండల్

New Project (99)

New Project (99)

Delhi : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఓ ఈవెంట్‌లో గేట్ నంబర్ టూ వద్ద పెద్ద పాండల్ కూలిపోయింది. పాండల్ కూలిపోవడంతో గందరగోళం నెలకొంది. ఘటన జరిగిన వెంటనే అనేక అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం లేదు.

Read Also:Minister Kakani Govardhan Reddy: ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం..!

×
×
Ad

జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పాండల్ కూలిన సంఘటనలో గాయపడిన వారిని సమీపంలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్రామా సెంటర్‌లో చేర్చారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.

Read Also:Drugs Case: గోవా జైల్ నుంచి డ్రగ్స్‌ దందా.. రూ.8 కోట్ల మత్తుపదార్థాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌..