Site icon NTV Telugu

Kavitha: కవితకు లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్

Kavith

Kavith

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రోస్‌ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్‌పై గురువారం న్యాయస్థానం విచారించింది. కవిత, ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం

తన కుమారులకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కవిత కోరారు. పిటిషన్ విచారించిన కోర్టు.. సోమవారినికి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఏప్రిల్ 20న విచారించనుంది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: Sandeshkhali: మీరు కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం చీకటి కాదు.. మమతా సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం..

బెయిల్‌ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని… ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారని తెలిపారు. ఆమె తన ఫోన్‌ డేటాను డిలీట్‌ చేశారని.. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని ఈడీ పేర్కొంది. పది ఫోన్లు ఇచ్చినా అన్నీ ఫార్మాట్‌ చేసే ఇచ్చారని.. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను కవిత ఫార్మాట్‌ చేశారని తెలిపింది. నిందితులంతా వందల డిజిటల్‌ డివైజ్‌లను ధ్వంసం చేశారని ఈడీ వెల్లడించింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారన్నారు. అయినా ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదని.. సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని ఈడీ స్పష్టంచేసింది. కుమారుడి పరీక్షలు కూడా కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని ఈడీ తెలిపింది. వాదనలు విన్నాక సోమవారానికి రిజర్వ్ చేసింది.

Exit mobile version