మైనర్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను మంగళవారం కోర్టు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బాలిక గర్భం దాల్చగా అతడి భార్య పిల్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీమా రాణిని కూడా ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీంతో వారు డ్యూటీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కాత్యాయిని శర్మ కంద్వాల్ ముందు విడివిడిగా హాజరయ్యారు.
Read Also: Rashmika Mandanna: ఇంత క్యూట్ గా సెల్ఫీలు తీసుకుంటే ఫ్యాన్స్ ఏమైపోతారు..
2020 నవంబర్, 2021జనవరి మధ్య నిందితుడు బాలికపై చాలాసార్లు అత్యాచారం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఆమె తండ్రి 2020 అక్టోబర్ లో మరణించిన తర్వాత ఆమె కుటుంబ స్నేహితుడైన నిందితుడి నివాసంలో ఉంటోందని పోలీసులు తెలిపారు. దీంతో బాధితురాలు వాంగ్మూలంతో దంపతులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడిపై పోక్సో చట్టం, సెక్షన్లు 376(2)(ఎఫ్) (రేప్), 509 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (బాధ కలిగించడం), 313 (మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం చేయడం) 120 బి (క్రిమినల్) కింద కేసు నమోదు చేశారు.
Read Also: VV Lakshminarayana: మళ్లీ పోటీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. ఈ సారి..!
బాలిక ఇటీవల అనారోగ్యానికి గురవడంతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. బాధితురాలు గతంలో తనపై జరిగిన దారుణాన్ని అక్కడికి కౌన్సిలర్‌కు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రేమోదయ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సోమవారంనాడు ఆదేశాలిచ్చారు.
